Monday, April 29, 2024

స‌మంత‌కి గుడి క‌డుతోన్న‌.. వీరాభిమాని సందీప్

సినీ న‌టుల‌కి ఫ్యాన్స్ ఉండ‌టం కామ‌నే.. కానీ వీరాభిమానులు కూడా ఉంటారు.వారు చేసే ప‌నులు నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంటాయి. కాగా బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్‌ అనే వ్యక్తి హీరోయిన్ సమంతకు వీరాభిమాని. సామ్‌ అంటే పడి చచ్చేంత ఇష్టం. తన అభిమాన తార మయోసైటిట్‌ బారిన పడిందని తెలియగానే సందీప్‌ తల్లడిల్లిపోయాడు. సామ్‌ ఆ వ్యాధి నుంచి కోలుకోవాలని ఏకంగా మొక్కుబడి యాత్రం చేశాడు. తిరుపతి, చెన్నై, నాగపట్నంలో యాత్ర చేశాడు. ఇలా సామ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న సందీప్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు.ఏకంగా సమంతకు ఆలయాన్నే కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటిలోనే సమంతకు గుడిని నిర్మిస్తున్నాడు. సమంత పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్‌ 28వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలోనూ పలువురు హీరోయిన్లకు గుడి కట్టిన ఘటనలు అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ తెలుగు వ్యక్తి ఇలా సినీ తారకు గుడి కడుతున్నాడన్న అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇప్ప‌టికే ప‌లువురు సినీ తార‌ల‌కు గుడి కట్టిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement