Tuesday, May 21, 2024

గిట్టుబాటు ధ‌ర లేక శ‌న‌గ‌రైతు కంట క‌న్నీరు…

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో శనగ రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రభుత్వ మద్దతు ధర ఏడాదికేడాది పెరుగుతున్నా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు సరిగా చేయకపోవడంతో రైతులు బహిరంగ మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయించే పరిస్థితి నెలకొంది. కనీస మద్దతు ధర కోసం పప్పుశనగ రైతులు ఎదురు చూస్తున్నారు. రబీలో సాగైన పంట నూర్పిడులు జరుగుతున్నా సేకరణ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో రైతులు ప్రయివేటు- వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు అడిగిన ధరకే పంటను అమ్ముతున్నారు. ప్రతి పంటనూ కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేదు. రైతు భరోసా కేంద్రాల్లో పేర్ల నమోదు ప్రక్రియ మాత్రమే మొదలైంది. ఎప్పటి నుంచి సేకరణ ప్రారంభమవుతుందో తెలియక రైతులు ప్రయివేటు- వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఏడాది శనగలు క్వింటాల్‌ మద్దతు ధర రూ.5335 ప్రభుత్వం ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాల్‌ రూ. 4500 మాత్రమే వుంది. క్వింటాల్‌ కు దాదాపు రూ.800 పైనే వ్యత్యాసం వుంది.


ఆంధ్రప్రదేశ్‌లో రబీ సీజన్‌లో రైతులు ఎక్కువగా సాగుచేసే పంటల్లో శనగ ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 4.5 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగైనట్లు- వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. శనగ నూర్పిడి పనులు వారం, పది రోజుల నుంచి ముమ్మరంగా జరుగుతున్నాయి. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చితో నష్టపోయిన రైతులు కనీసం శనగ ఆదుకుంటు-ందని ఎదురు చూసినా.. ధర లేక దిగాలు చెందుతున్నారు. శనగపంట రాష్ట్రంలో ప్రధానంగా కర్నూలు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలో ఎక్కువగా సాగవుతోంది. అయితే నవంబరులో వర్షాలు పడటంతో పంట దెబ్బతింది. ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్లు వరకు దిగుబడి చేతికొచ్చింది. వ్యాపారులు క్వింటాకు రూ.4,500లకు అడుగుతున్నారు. పంట నూర్పిడిలు పూర్తయితే ధర మరింత పడిపోయే ప్రమాదముంది. అప్పులు తెచ్చి పెట్టు-బడులు పెట్టినవారు వాటిని తీర్చుకునేందుకు ఏదో ఒక ధరకు అమ్మేస్తున్నారు. మిగతా రైతులు మాత్రం శీతల గిడ్డంగులకు తరలిస్తున్నారు. శనగ సాగుకు ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టు-బడి పెట్టారు. కౌలు రైతులు అదనంగా రూ.15 వేలు వెచ్చించారు. ఇప్పుడున్న ధరకు అమ్మితే కనీస పెట్టు-బడి కూడా రాదు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి దాటిన రైతులు మాత్రం ఖర్చుల నుంచి బయటపడతారు. పంట మధ్యలో ఉన్న సమయంలో సోకిన ఎండు తెగులు దిగుబడిపై ప్రభావం చూపింది. లేకపోతే ఎకరాకు సరాసరి 11 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది.

ప్రస్తుతం దిగజారుతున్న ధరలు, దిగుబడులు చూచి శనగ రైతులు లబోదిబోమంటు-న్నారు. చాలామందికి పెట్టిన పెట్టు-బడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఖరీఫ్‌లో వేసిన మిర్చికి నల్లతామర, ఎర్రనల్లి కారణంగా దిగుబడులు తగ్గాయి. ఆ తర్వాత వేసిన శనగకు కూడా తెగుళ్లు ఆశించటంతో రైతులకు కష్టాలు తప్పలేదు. సొంత పొలం ఉన్న రైతులైతే అరకొర లాభాలతో బయటపడతారు. కౌలు రైతులైతే నిండా మునిగే పరిస్థితి. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రైతుల నుంచి మద్ధతు ధరకు శనగపంట కొనుగోలు చేస్తే నష్టపోకుండా, అప్పులపాలు కాకుండా బయటపడే అవకాశముంది. కొనుగోలు కేంద్రాల్లో కూడా ప్రతిరైతు నుంచి శనగలు కొనాలని వారు కోరుతున్నారు. అక్కడ రాజకీయ రంగు పులిమి పక్షపాత చూపిస్తే రైతులు మరింత ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. రైతులు శీతల గోదాముల్లో పంట నిల్వ చేయటానికి అద్దె రూపంలో క్వింటాకు రూ.100 చెల్లించాల్సి ఉంటు-ంది. అక్కడకు తరలించేందుకు రవాణా ఛార్జీలు, ఎత్తటానికి, దించటానికి కూలీల ఖర్చు ఇవన్నీ కూడా రైతులకు అదనపు భారంగా మారాయి. గత మూడేళ్లుగా ధరల్లేక సీటకంగిద్దంగుల్లో మూలుగుతున్నాయి. దీంతో రైతులకు అద్దె భారం తడిసి మోపెడువుతోంది.

క్వింటా రూ.4500కే విక్రయాలు..
పప్పుశనగ పంటకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ.5330 ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ప్రయివేటు- వ్యాపారులు కొనుగోలు చేస్తున్నది క్వింటా రూ.4500 వరకు మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర కంటే రూ.830 తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సిన వస్తోంది. పంట విత్తుకునే సమయంలో ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చిన ధరనే క్వింటా రూ.5200 ఉంది. సబ్సిడీ కాకుండా క్వింటా రూ.6100గా నిర్ణయించి రైతులకు ఇచ్చింది. ఇప్పుడు చూస్తే క్వింటా ధర రూ.4500 మాత్రమే ఉండటంతో ప్రభుత్వం తక్షణం మద్దతు ధరకు పప్పుశనగ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసినా ఒక్కో రైతు నుంచి 25 క్వింటాళ్లు వరకు మాత్రమే పరిమితి ఉంది. ఆపైన పండిన పంటను రైతుల నుంచి కొనుగోళు చేయడం లేదు. దీంతో మూడు ఎకరాలపైనున్న రైతులు తక్కిన పంటను బయట అమ్ముకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఎకరానికి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అంటే మూడు ఎకరాల రైతుకు పూరి స్థాయిలో పంట తొమ్మిది క్వింటాళ్లు వస్తే మూడు ఎకరాలకే 27 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఆపైన భూమి కలిగిన రైతులు బహిరంగ మార్కెట్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది.

గోనె సంచులు కరువు
పప్పుశనగ రైతుకు ప్రభుత్వం వామ హస్తం చూపిందనే విమర్శలున్నాయి.. కనీస మద్దతు ధరతో పంటను కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆర్బీకేల్లో రైతుల పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో సరిపెట్టారు. గోనె సంచులు కొరతతో కొనుగోలు చేయకపోతున్నామని సంబంధిత అధికారులు పేర్కొంటు-న్నారు. సంచుల కోసం రాష్ట్ర ఉన్నతాధికారులకు పక్షం రోజులక్రితమే లేఖ పంపినా ఇప్పటి దాకా స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎప్పటిలోగా తమ పంటను కొనుగోలు చేస్తారో తెలియని అయోమయంలో రైతులు కొట్టు-మిట్టాడుతున్నారు. శనగ పంట పండించే ఆయా జిల్లాలోని రైతుభరోసా కేంద్రాల్లో ఈ నెలారంభంలో రైతుల పేర్లు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టారు. ఇప్పటి దాకా పలు మండలాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. పంటకొనుగోలు చేసేందుకు అవసరమైన గోనె సంచులు లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేకపోతున్నారు.ఎప్పుడు తమ పంట కొనుగోలు చేస్తారంటూ రైతులు నిట్టూరుస్తున్నారు. కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టకపోవడంతో పలుప్రాంతాల్లో రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. జిల్లాకు లక్ష గోనె సంచులు కావాలని ఏపీ మార్క్‌ఫెడ్‌ అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఇండెంట్‌ పెట్టినట్లు- తెలిసింది.
ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాలి..
పప్పుశనగను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని మాటలు మాత్రమే చెబుతోంది. ఆచరణలో కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదు. ఇప్పటికే 70 శాతానికిపైగా పంట నూర్పిడి పూర్తయ్యింది. రైతులు ఇళ్లలో పెట్టు-కునే పరిస్థితుల్లేవు. బయట ధర కూడా లేదు. అందుకే తక్షణం ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాలి. కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టాలి.
కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు ప్రారంభిస్తే ఈ మేరకు ఖర్చులు ఆదా కావటంతో పాటు- రైతులకు మేలు జరుగుతుంది.
మార్కెట్‌ యార్డు ద్వారా ప్రభుత్వం శనగ పంట కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అప్పుడు మద్ధతు ధర క్వింటాకు రూ.5,330లకు తగ్గకుంటే న్యాయం జరుగుతుందని అంటు-న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement