Wednesday, May 15, 2024

Rx100 డైరెక్టర్ నెక్స్ట్ మూవీ అప్డేట్.. ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

అజయ్ భూపతి తెలుగులో RX 100 సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శర్వానంద్, సిద్దార్థ్‌లతో మహాసముద్రం మూవీని తెరకెక్కించాడు. అయితే దురదృష్టవశాత్తు మహాసముద్రం ప్రేక్షకులని పెద్డగా ఆకట్టుకోలేకపోయింది.. దీంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక, ఇప్పుడు అతను ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘‘మంగళవారం’’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, దయానంద్ రెడ్డి, కమల్ కృష్ణ ప్రదాన పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 10:10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాగా, ఇదివరకు ఈ సిినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్‌ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ లో ఒక మహిళ తలుపు రంధ్రం నుండి చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక, ‘‘మంగళవారం’’ సినిమాని ముద్రా మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు. కాంతార, విరూపాక్ష వంటి ప్రముఖ సినిమాలతో పేరుగాంచిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మల్టిపుల్ లాంగ్వేజ్ లో రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement