Friday, May 3, 2024

రష్యా ఆర్థిక పతనమే జీ7 టార్గెట్‌.. రష్యా బంగారం, క్రూడాయిల్‌ దిగుమతులపై నిషేధం

బెర్లిన్‌: ఉక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడమే లక్ష్యంగా జీ7 సదస్సు పలు తీర్మానాలను ప్రవేశ పెట్టింది. జర్మనీలోని కాస్టెల్‌ ఆప్‌ ఎలామ్యులో రెండు రోజుల పాటు జరిగిన జీ7 దేశాల సదస్సు మంగళవారం ముగిసింది. సదస్సు ముగిసిన అనంతరం జర్మనీ చాన్స్‌లర్‌ ఓలాఫ్‌ స్కోల్జో జీ7 సదస్సు తీర్మానాన్ని మీడియాకు వెల్లడించారు.
జీ7 గ్రూపులోని ఏడు దేశాలు ఉమ్మడిగా ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించాయని ఓలాఫ్‌ ప్రకటించారు. దీర్థకాలం పాటు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాలని తీర్మానించడంతో పాటు, రష్యాపై తీవ్రమైన, తక్షణ ఆర్థిక ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. దీంతో అతిత్వరలో రష్యా క్రూడాయిల్‌ దిగుమతులపై సైతం ఆంక్షలు విధించే అవకాశం ఉంది. రష్యా చేస్తున్న యుద్దం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్భణం అధికమైందని,రష్యా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నష్ట పరించిందని జీ7 తీర్మానించింది.

రష్యా బంగారం దిగుమతులపై నిషేధాన్ని ఆమోదించాయి. ఆహార కొరత ఉన్న దేశాలకు సాయం అందించాలని నిర్ణయించాయి. ధరల పెరుగుదలను నియంత్రించాలని తీర్మానించాయి. తీర్మానంలో ఉక్రెయిన్‌లోని షాపింగ్‌ సెంటర్‌పై రష్యా దాడి చేయడాన్ని యుద్దనేరంగా పరిగణించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ అందుకు బాధ్యుడని స్పష్టం చేసింది. సదస్సు ముగించడానికి ముందు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, గ్రేట్‌ బ్రిటన్‌, కెనడా మరియు జపాన్‌ దేశాధినేతలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. రష్యా ఆయిల్‌ దిగుమతులపై జీ7 ఆంక్షలను భారత్‌ వ్యతిరేకించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement