Wednesday, April 24, 2024

కర్భన వ్యర్థాల విడుదల్లో అట్టడుగున భార‌త్.. ప్రకృతితో సహజీవనమే మార్గం

జర్మనీ: ప్రపంచ జనాభాలో ఇండియా 17శాతం వాటా, కలిగి ఉన్నప్పటికీ, కర్భన వ్యర్థాల విడుదలలో మాత్రం అంతర్జాతీయంగా ఇండియాది కేవలం 5 శాతం మాత్రమేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. జర్మనీలో జరుగుతున్న రెండు రోజుల జీ7 సదస్సుకు హాజరైన ప్రధాని కీలక ఉపన్యాసం చేశారు. క్లయిమేట్‌ ఛేంజ్‌పై భారత విధానం ప్రపంచదేశాలు అనుసరించాల్సిన మార్గాలని ప్రధాని స్పష్టం చేశారు. తరతరాలుగా భారతీయులు పాటిస్తున్న జీవనశైలి ప్రకృతితో ముడిపడి ఉందని ఆయన అన్నారు. ప్రకృతితో కలిసి సహజీవనం చేయడం ద్వారా ఇండియా పర్యావరణాన్ని పరిరక్షిస్తోందని ప్రధాని అన్నారు. ప్రపంచంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ శరవేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని ప్రకటించారు.

అయితే, ఈ పరిణామదశలో కూడా ఇండియా పర్యావరణానికి పెద్ధ స్థానం కల్పించిందని, పర్యావరణానికి నష్టం కలిగించట్లేదని ఆయన అన్నారు. క్లయిమేట్‌ ఛేంజ్‌ పట్ల ఇండియాకు ఉన్న అంకితభావానికి ఇండియా పనితీరే రుజువని ఆయన అన్నారు. ఎథనాల్‌ కలి పిన పెట్రోల్‌ ను 10శాతం లక్ష్యాన్ని గడువుకు ఐదు నెలల ముందే సాధించడం జరిగిందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్‌ పవర్‌ ఎయిర్‌ పోర్ట్‌ ఇండియాలో ఉందని ప్రకటించారు. దేశంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థ కూడా నెట్‌ జీరోగా ఈ దశాబ్ధంలో మారనుందని ప్రధాని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement