Monday, April 29, 2024

WPL | ఆఖ‌రి బంతికి రనౌట్.. ఒక‌ప‌రుగు తేడాతో ఢిల్లీ విజ‌యం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ ముందు 182 పరుగుల టార్గెట్‌ను సెట్ చేసింది. అయితే, చేజింగ్‌లో గెలుపు అంచుల వరకు వచ్చినా.. ఆఖరి బంతికి ఆర్సీబీ ప్లేయర్ రౌనట్ కావడంతో ఒక పరగుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇక ఈ గెలుపుతో ప్లేఆఫ్స్‌ కు చేరుకుంది ఢిల్లీ.

భారీ చేజ్‌లో ఆర్సీబీ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 29 బంతుల్లో (51) హాఫ్ సెంచరీ చేసి అదరకొట్టింది. ఎల్లీస్ పెర్రీ 38 బంతుల్లో 49 పరుగులు చేసి అవుట్ అయ్యింది. సోఫీ మోలినెక్స్ (33) , సోఫీ డివైన్ (26), జార్జియా వేర్‌హామ్ (12) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.

ఇక అంతక ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ లో జెమీమా రోడ్రిగ్స్ (58), అలిస్ క్యాప్సీ (48) ధీటుగా ఆడారు. ఢిల్లీ ఓపెనర్లు మెగ్ లానింగ్ (29), షఫాలీ వర్మ (23) ఫర్వాలేదనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement