Monday, April 29, 2024

గణపతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారా? అయితే ఇది తప్పనిసరి

ఈనెల 10న వినాయకచవితి సందర్భంగా అప్పుడు చాలా ప్రాంతాల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేసి గణపతి విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరుతున్నారు.

గణేష్ విగ్రహాలను ప్రధాన రహదారులు, ప్రజలు తిరిగే రోడ్లపై, వాహనదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతిష్టించాలని పోలీసులు తెలిపారు. గణపతిని ప్రతిష్టించేవారు ముందుగా http://policeportal.tspolice.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ లింకు ద్వారా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశం, నిమజ్జనం నిర్వహించే రోజు, సమయం, దారి వంటి వివరాలను పొందుపరచాలని, విగ్రహం ప్రతిష్టించే స్థల యజమాని అనుమతి పత్రం జతపరచాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement