Monday, May 6, 2024

ఆర్టీసీ బస్సులో – కోడిపుంజుకు టికెట్

పెద్దపల్లి : జిల్లాలో కోడిపుంజుకు ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ కొట్టిన సంఘటన చోటుచేసుకుంది. గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కరీంనగర్ వెళ్లే క్రమంలో , సుల్తానాబాద్ లో మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు కరీంనగర్ కు వెళ్లేందుకు వెంట తెచ్చుకున్న కోడిపుంజు తో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కండక్టర్ ఆలీతో పాటు కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. ఇదేమిటని అడిగితే ప్రాణం ఉన్న జీవికి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ వివరణ ఇవ్వడంతో ఆలీ కంగుతిన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement