Wednesday, April 24, 2024

షారుక్ ఖాన్ కి – శృతి హాస‌న్ మ‌ద్ద‌తు

హీరోయిన్ శృతిహాస‌న్ ..బాలీవుడ్ స్టార్ న‌టుడు షారుక్ ఖాన్ కి మ‌ద్ద‌తుగా నిలిచింది. గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన తీరుతో షారూక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ ఈ విషయంలో షారూక్ కు.. శృతి మద్దతుగా నిలిచింది. షారూక్ ,లతాకు నివాళి అర్పించిన ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో శృతి హాసన్ పోస్ట్ చేసింది. ‘లవ్ దిస్ మ్యాన్.. ఆల్వేస్ ఆల్వేస్’ (ఎప్పుడూ ఈ మనిషిని ప్రేమించు) అన్న క్యాప్షన్ తగిలించింది. శనివారం ముంబైలోని శివాజీ పార్క్ లో లతా మంగేష్కర్ అంత్యక్రియలు జరగడం తెలిసిందే. షారూక్ ఖాన్ తన రెండు చేతులు జోడించి దోసిలి పట్టినట్టుగా దువా చేయడం తెలిసిందే. ఆయన ఆ సమయంలో లతా కోసం అల్లాను ప్రార్థించినట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement