Thursday, May 2, 2024

వందే భారత్‌ రైళ్లతో రూ.40 వేల కోట్ల వ్యాపారం..15 వేలకుపైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం

రానున్న మూడేళ్లలో 400 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టాలనే బడ్జెట్‌ ప్రతిపాదన వ్యాపారం, ఉపాధి కల్పనకు దోహదపడనుంది. ఉమ్మడిగా రూ.40 వేల కోట్ల వ్యాపారంతోపాటు 15 వేలకుపైగా ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుందని రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. నూతన ఇంధన సామర్థ్యమున్న 400 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెడ తామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. వందే భారత్‌ రైళ్లు సెమీ హైస్పీడ్‌ ట్రైన్లు. దాదాపు రూ.100 కోట్ల మిత వ్యయంతో ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌) వద్ద నిర్మించనున్నారు. ఇది ఒక భారీ ప్రకటన మాత్రమే కాదు. రూ.40 వేల కోట్లకుపైగా వ్యాపార అవకాశం. దీంతో 15 వేలకుపైగా ఉద్యోగాల సృష్టితోపాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో రెండే వందేభారత్‌ రైళ్లు ఉన్నాయి. ఢిల్లి నుంచి వారణాసి, ఢిల్లి నుంచి కత్రా మధ్య నడుస్తున్నాయి. దేశంలో జంట రైలు లేకుండా ప్రయాణిస్తున్న ఏకైనా రైళ్లు వందే భారత్‌ మాత్రమేనని ఐసీఎఫ్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. కాగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్మాణంలో కేవలం 15 శాతం మాత్రమే విదేశీ దిగుమతులు ఉన్నాయి. రైళ్ల ఉత్పత్తి పెరిగితే దిగుమతులు కూడా పెరిగే అంచనాలున్నాయని అధికా రి చెప్పారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉత్పత్తి, రవాణా సవాళ్ల కారణంగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఎలాంటి అవరోధాలు ఎదురైనా లక్ష్యాలను చేరుకుంటామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement