Monday, April 29, 2024

ట్రెండింగ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ గ్లింప్స్..

పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం నంద‌మూరి ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్..ఎన్టీఆర్ ఫ‌స్ట్ టైం క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్‌ ఇచ్చారు మూవీ మేకర్స్‌. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

45సెక్లన పాటు కొనసాగిన ఈ వీడియో రిలీజ్‌ అయిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా కీరవాణి బీజీఎం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.

Advertisement

తాజా వార్తలు

Advertisement