Friday, May 3, 2024

లుమినస్‌తో ఆర్‌ఆర్‌ కేబల్‌ డీల్‌.. హోమ్ అప్లయెన్స్, ఎలక్ట్రికల్ వ్యాపారం

సుప్రసిద్ధ ఎలక్ట్రికల్‌ వస్తువులు తయారు కంపెనీ ఆర్‌ఆర్‌ కేబల్‌ కీలక ప్రకటన చేసింది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా.. స్నీడర్‌ నుంచి ల్యుమినస్‌ హోమ్‌ ఎలక్ట్రికల్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది. ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ భాగస్వామ్య కంపెనీగా ఆర్‌ఆర్‌ కేబల్‌ కొనసాగుతున్నది. ఈ విలీనంతో ఆర్‌ఆర్‌ కేబల్‌ ఫ్యాన్లు, లైట్లు, అప్లయెన్స్‌తోపాటు కన్జ్యూమర్‌ ఎలక్ట్రికల్‌ వ్యాపారం మరింత బలోపేతం కానుందని ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఈ ఒప్పందం.. మే 2022 నాటికి పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. విలీనంపై ఆర్‌ఆర్‌ కేబల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ గోపాల్‌ కాబ్రా మాట్లాడారు. ల్యుమినెస్‌ హోమ్‌ ఎలక్ట్రికల్‌ బృందంతో పాటుగా అసోసియేట్లను ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ఇరువురి బలాలపై ఆధారపడి మరీ ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యం, సామర్థ్యాలపై ఆధారపడి తాము సేవలను విస్తరించడంతో పాటు వినియోగదారులకు అత్యుత్తమ విలువను అందించగలమని భరోసా వ్యక్తం చేశారు. ఈ విలీనంతో భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న హోమ్‌ ఎలక్ట్రికల్‌ పరిశ్రమలో తమ స్థానం మరింత బలోపేతం చేసుకుంటామన్నారు.

ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ చైర్మన్‌ త్రిభువన్‌ కాబ్రా మాట్లాడుతూ.. తమ వృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైన ముందడుగు ఇది అన్నారు. ఈ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా తమ ఉత్పత్తి జాబితాలో స్థిరంగా ఆవిష్కరణలు చేయడం ద్వారా వినియోగదారుల అంచనాలను అందుకుంటున్నామని తెలిపారు. ఈ విలీనంతో తమ బ్రాండ్‌ను మరో దశకు తీసుకెళ్లగలమని భరోసా వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ కేబల్‌ సీఈఓ, కన్జ్యూమర్‌ (ఎఫ్‌ ఎంసీజీ) వివేక్‌ అబ్రాల్‌ మాట్లాడుతూ.. వృద్ధి పరంగా తమ నూతన అధ్యాయంలో ల్యుమినస్‌ హూమ్‌ ఎలక్ట్రికల్‌ వ్యాపారం తమకు శక్తివంతమైన జోడింపుగా నిలుస్తుందని వివరించారు. రాబోయే 56 ఏళ్లలో హూమ్‌ ఎలక్ట్రికల్‌ విభాగంలో సుప్రసిద్ధ జాతీయ పోర్ట్‌ పోలియో సృష్టించాలనే తమ లక్ష్యంలో ఇది ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement