Monday, April 29, 2024

రోలెక్స్ పాత్ర ఆధారం సినిమా.. పదేళ్ల వరకు బిజీగా దర్శకుడు లోకేశ్ క‌న‌గ‌రాజ్

త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన విక్ర‌మ్ సినిమా ఎంత‌పెద్ద హిట్టో అంద‌రికీ తెలిసిందే..విశ్వ న‌టుడు కమల్ హాసన్ టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ మూవీలో స్టార్ హీరోలు విజయ్‌ సేతుపతి, ఫహద్ ఫాసిల్‌, విక్రమ్‌ కీలక పాత్రల్లో నటించారు. విక్రమ్‌లో హీరో సూర్య పోషించిన రోలెక్స్ పాత్రకు అద్బుతమైన స్పందన వచ్చింది. రోలెక్స్‌ పాత్ర ఈ సినిమాకు మెయిన్‌ హైలెట్‌గా నిలిచింది. అయితే ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. రోలెక్స్‌ ఆధారంగా ఓ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని ఇంటర్వ్యూలో చెప్పాడు లోకేశ్ కనగరాజ్‌‌.

అంతేకాదు థళపతి 67, ఖైదీ 2, విక్రమ్‌ 2 సినిమాలతోపాటు పలు ప్రాజెక్టులతో రాబోయే పదేళ్లు తాను చాలా బిజీగా ఉంటానని చెప్పుకొచ్చాడు. విజయ్‌తో తెరకెక్కిస్తున్న థళపతి 67 షూటింగ్‌ త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు లోకేశ్‌. కొత్తదనంతో కూడిన ప్రయోగాత్మక కథలను సిల్వర్ స్క్రీన్‌పై పర్‌ఫెక్ట్‌గా చూపించడంలో లోకేశ్‌ కనగరాజ్‌ రూటే వేరని ఆయన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఇక విలక్షణ, ప్రయోగాత్మక పాత్రలు చేసే యాక్టర్లలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటాడు సూర్య. మరి రాబోయే కాలంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉండబోతుందని, అది కూడా సూపర్ క్రేజ్‌ సంపాదించుకున్న రోలెక్స్ పేరుతో ఉండబోతుందన్న అప్‌డేట్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినీ జనాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement