Sunday, April 28, 2024

తాగనీకి పైసల్లేక.. మ‌ద్యం షాప్ కే క‌న్నం వేశారు..

వరంగల్ (ప్రభ న్యూస్) : వారిద్దరూ సగటు జీవులే. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు. ఆ ఇద్దరు మద్యంకు బానిసలయ్యారు. రెక్కల కష్టంతో వచ్చిన సంపాదన వారి మద్యం అవసరాలనే కాదు, కుటుంబ అవసరాలను తీర్చలేదు. మద్యం మత్తుకు బానిసైన ఆ ఇద్దరు మద్యం షాప్ కు కన్నం వేసి, అందినకాడికి మందు బాటిళ్లను దోచుకోవడంతో పాటు, లిక్కర్ షాపుల్లోని మనీని కూడ దొంగిలించి, లైఫ్ ఎంజాయ్ చేయాలనుకొన్నారు. అనుకొన్న ప్రకారం మద్యం షాప్ కు కన్నం వేశారు. మద్యం, మనీ దొంగలించుకపోయారు. కానీ వరంగల్ కమిషనరేట్ పోలీసులు కేసును దర్యాప్తు చేసి, దొంగతనం చేసిన ఇద్దరి దొంగలను అరెస్ట్ చేశారు. వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మి ఈ కేసుకు సంబంధించిన వివరాలను పత్రికలకు విడుదల చేశారు.

సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపులకనపర్తి గ్రామ శివారులోని మద్యం దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను సంగెం పోలీసులు అరెస్టు చేశారన్నారు. వీరి నుండి 26 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నట్లు డిసిపి వెంకటలక్ష్మి తెలిపారు. నిందితులు అక్కడి నుండి తప్పించుకోని పోయే సమయంలో మద్యం దుకాణంలోని సిసి కెమెరాల డివిఆర్‌ను సైతం దొంగిలించి, మద్యం సీసాలను వేసుకున్న గోనే సంచిలోనే వేసుకోని తమతో తెచ్చుకున్న ద్విచక్రవాహనంపై పారిపోయారు. ఇదే సమయంలో నిందితులు దొంగిలించిన డివిఆర్ నీటి కెనాల్ పడవేసి వెళ్లారు. నిందితులు మరో ఇద్దరితో కల్సి 2019 సంవత్సరంలో గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రైస్ మిల్లులో ఏడు క్వింటాళ్ళ బియ్యాన్ని చోరీ చేసిన సంఘటనలో ఆధారంగా. మద్యం దుకాణంలో జరిగిన చోరీపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మద్యం దుకాణంలో దోరికిన క్లూస్ తో నిందితులను గుర్తించారు. గవిచర్ల ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు పోలీసులకు పట్టుబడ్డారని వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి వెంకట లక్ష్మీ తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement