Friday, April 26, 2024

రిష‌బ్ శెట్టి కౌంట‌ర్.. ర‌ష్మిక‌ని ఉద్దేశించేనా

క‌న్న‌డ హీరో రిష‌బ్ శెట్టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ విలేఖ‌రి మీ సినిమాలో హీరోయిన్ గా వీరిలో ఎవరిని ఎంచుకుంటారు అని .. రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి, సమంత పేర్లు అడిగారు.. అయితే దీనికి సమాధానంగా తాను స్క్రిప్ట్ పూర్తయ్యాకనే నటీనటులను ఎంచుకుంటానని, కొత్త వారికి అవకాశం ఇవ్వటానికి ఎక్కువగా ప్రయత్నిస్తానని అన్నారు.. ఆ తర్వాత గాల్లో రెండు చేతులతో కొటేషన్ సింబల్ చూపిస్తూ ఇలాంటి హీరోయిన్లు తనకు నచ్చరని, కానీ సాయిపల్లవి, సమంతలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ప్రస్తుతం రిషబ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆయన ఈ కౌంటర్ ను హీరోయిన్ రష్మిక వేశారని అభిప్రాయపడుతున్నారు..

కాగా ఇటీవల రష్మిక ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ అవకాశం రావడం వెనకున్న కథ చెప్పారు. ఒక అందాల పోటీలో తాను గెలిచానని, ఆ సమయంలో తన ఫొటో ఒక ప్రముఖ దినపత్రిక మొదటి పేజీలో వచ్చిందని, దాంతో తనకు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చిందని తెలిపారు. ప్రొడక్షన్ హౌస్ గురించి తెలిపే సమయంలో రష్మిక రెండు చేతులతో గాల్లో కొటేషన్ సింబల్ చూపిస్తూ మాట్లాడటంతో అది బాగా వైరల్ అయింది. ఈ’కిరిక్ పార్టీ’ సినిమాకు రిషబ్ శెట్టినే దర్శకుడు. కాగా ఈ చిత్రంలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి ఆ సినిమాను నిర్మించారు. అయితే ఆ రోజు రష్మిక చేసిన వ్యాఖ్యలకు రిషబ్ శెట్టి గట్టిగా కౌంటర్ ఇచ్చిన‌ట్ల‌యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement