Sunday, June 23, 2024

RIP – ప్ర‌ముఖ తెలుగు,సంస్కృత పండితుడు సింగారాచార్యులు మృతి… కెసిఆర్ సంతాపం

హైద‌రాబాద్ – ప్రముఖ తెలుగు, సంస్కృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీ సింగరాచార్యుల భాషాసాహిత్య కృషిని, అధ్యాపకులుగా, ఉపన్యాసకులుగా, రచయితగా, వ్యాకరణ పండితుడిగా తెలుగు సంస్కృత భాషలకు వారు చేసిన సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుమారుడు, ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ఎడిటర్ కె. శ్రీనివాస్ సహా కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement