Friday, June 14, 2024

TS | ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్టార్‌ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని సిఎం రేవంత్ చెప్పారు. ఈ ఇఫ్తార్ విందులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం మోదీ తరం కాదు : రేవంత్

తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది ఆయన వల్ల కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింల రిజర్వేషన్‌ను తొలగించడం ప్రధాని మోదీ వల్ల గానీ, అమిత్ షా వల్ల గానీ కాదని స్పష్టం చేశారు.

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళ్తుందని వ్యాఖ్యానించారు. మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు.

హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్లలాంటి వారని అన్నారు రేవంత్ రెడ్డి. అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement