Sunday, April 28, 2024

Delhi | రైళ్లలో జర్నలిస్టుల రాయితీ పునరుద్ధరించండి.. లోక్‌సభలో ప్రత్యేకంగా ప్రస్తావించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రయాణికుల రైళ్లలో జర్నలిస్టులకు గతంలో కల్పించిన రాయితీని పునరుద్ధరించాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం లోక్‌సభలో రూల్ 377 కింద ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన కోవిడ్-19 సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్ధరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. జర్నలిస్టులు వృత్తిరీత్యా అనేక ప్రాంతాలకు తరచుగా ప్రయాణాలు చేస్తుంటారని.

ఈ క్రమంలో రాయితీ లేకపోవడంతో వారిపై ఆర్థికంగా భారం పడుతోందని అన్నారు. కోవిడ్-19 ముందు వరకు జర్నలిస్టులకు రాయితీ సదుపాయం ఉండేదని కోవిడ్-19 సమయంలో అన్ని రకాల రాయితీలను కేంద్రం రద్దు చేసిందని గుర్తుచేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మిగతా అన్ని రకాల రాయితీలను పునరుద్ధరించినప్పటికీ జర్నలిస్టు రాయితీలను పునరుద్ధరించలేదని తెలిపారు. రాయితీల ద్వారా రైల్వే శాఖకు ఏటా రూ. 50 వేల కోట్ల భారం పడుతోందని తెలుసని, జర్నలిస్టులకు కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement