Monday, May 6, 2024

యాజమాన్య కోటా బీడీఎస్‌ సీట్ల భర్తీ… నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రయివేటు దంత కళాశాలల్లో యాజమాన్య కోటా బీడీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సిలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

సీట్ల ఖాళీల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement