Friday, January 27, 2023

షమీ స్థానంలో ఉమ్రాన్‌

గాయం కారణంగా సీనియర్‌ పేసర్‌ షమీ బంగ్లాతో వన్డే సిరీస్‌ మొత్తానికి దూరం అయ్యారు. బీసీసీఐ ట్వీట్‌ చేసింది. బంగ్లాతో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్‌ తగిలింది. గాయం కారణంగా సీనియర్‌ పేసర్‌ షమీ ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. బీసీసీఐ ఈ మేరకు ట్వీట్‌ చేసింది. భుజం గాయంతో షమీ బాధపడుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. షమీ స్థానంలో భారత యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటు కల్పించారు.

బంగ్లాతో వన్డే సిరీస్‌కు ముందు నిర్వహించిన ట్రైనింగ్‌ సెషన్‌లో షమీకి గాయమైంది. అతడు ప్రస్తుతం ఎన్‌సీఏ పర్యవేక్షణలో ఉన్నాడు. బంగ్లాకు వెళ్లే టీమ్‌తో అతడు వెళ్లలేదు అని బీసీసీఐ తెలిపింది. అయితే అతడి గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement