Saturday, May 18, 2024

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలి.. మంత్రి కేటీఆర్

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ వరదలపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో పరిస్థితులపై ప్రగతి భవన్‌ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… ప్రాణనష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. వర్షాలు కొనసాగితే ముందు జాగ్రత్తలపై సిద్ధంగా ఉండాలన్నారు. పురాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని, కల్వర్టులు, వంతెనల వద్ద హెచ్చరిక సూచీలు పెట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి సేవలు వినియోగించుకోవాలన్నారు. పురపాలికలో సహాయ చర్యలను సీఎండీఏ పర్యవేక్షించాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement