ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్‌కు ఇ-కామర్స్‌లో తిరుగులేదని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశీయ ఇ-కామర్స్‌లో రిలయన్స్ 12.30 ల క్షల కోట్లతో అమెజాన్, వాల్‌మార్ట్‌ల కంటే ముందుందని తెలిపింది. అతి పెద్ద రిటైల్ సేల్స్ నెట్‌వర్క్, అగ్రస్థానంలో ఉన్న టెలికం కార్యకలాపాలు, బలమైన డిజిటల్ మీడియా వంటివి రిలయన్స్‌ను ముందుకు నడిపిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. దేశంలో ఇ-కామర్స్ మార్కెట్‌లో రిలయన్స్, అమెజాన్, వాల్‌మార్ట్ మధ్యే ముక్కోణపు పోటీ నెలకొని ఉందని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
సంప్రదాయ రిటైల్ వ్యాపార నమూనా ఆఫ్‌లైన్ వాల్‌మార్ట్, ఆన్‌లైన్ అమెజాన్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. భారత్‌లో ఇ-కామర్స్ మార్కెట్ ఇందుకు భిన్నంగా ఉంటుందని, పంపిణీ సవాళ్లు, చాల సాంకేతికతు దాటడం కీలకమైన అంశమని పేర్కొంది. ఇంట్రిగ్రేడెట్ మెడల్ బలమైన పంపిణీ సామర్ధ్యం, అధిక ధరల ప్రయోజనం ప్రారంభం నుంచే అవసరమవుతాయని నివేదిక అభిప్రాయపడింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయంగా అతి పెద్ద డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. దీని అనుబంధ సంస్థ జియోకు 43 కోట్ల మంది మొబైల్ చందాదారులు ఉన్నారని తెలిపింది. రిటైల్ అనుబంధ సంస్థకు దేశీయంగా 13,300 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. వీటిలో 2.46 లక్షల కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇ-కామర్స్ 17-18 శాతానికి పెరుగుతుందని, అంటే దాదాపు 6 బిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపింది. సమగ్ర ఆఫ్‌లైన్ ప్లస్ ఆన్‌లైన్ ప్లస్ ప్రైమ్ స్టీమ్‌లోకి రిలయన్స్ ప్రవేశిస్తే అమెజాన్, వాల్‌మార్ట్‌లకు గట్టి పోటీ ఇస్తుందని నివేదిక స్పష్టం చేసింది.
ఇండియా ఇ-కామర్స్ మార్కెట్ 2025 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్లిప్‌కార్ట్ 23 బిలియన్ డార్లు, జీఎంవీ, అమెజాన్ 18-20 మిలియన్ డాలర్లు, జీఎంవీతో మొదటిరెండు స్థానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయని, రిలయన్స్ 5.7 బిలియన్ డాలర్ల జీఎంవీతో మూడో స్థానంలో ఉందని పేర్కొంది. ఫ్యాషన్‌లో అజియో, ఇ-గ్రోసరిలో జియోమార్ట్ ఇందుకు సహకరిస్తున్నాయి. ఈ మూడు సంస్థలు గెట్ బిగ్, గెట్ క్లోజ్ గెట్ పిట్ పై ప్రధానంగా దృష్టి సారించాయని తెలిపింది.