Monday, December 9, 2024

Big Breaking | ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​.. వర్షం కారణంగా రేపటికి వాయిదా!

అహ్మదాబాద్​లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇవ్వాల (ఆదివారం) జరగాల్సిన ఫైనల్​ మ్యాచ్​ రేపటికి (సోమవారం) వాయిదాపడింది. సాయంత్రం నుంచి కుండపోత వానతో అహ్మదాబాద్​ సిటీ మొత్తం నీటితో నిండిపోయింది. కాగా, చెన్నై, గుజరాత్​ జట్ల మధ్య ఇంట్రెస్టింగ్​గా సాగే పోరు చూడ్డానికి, ధోనీ ఆఖరి ఆటను కనులారా చూసి తరించడానికి స్టేడియానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. దీంతో అహ్మదాబాద్​ వీధులన్నీ జనంతో నిండిపోయాయి.

ఇక.. మ్యాచ్​కోసం టాస్​ వేస్తారు అనుకునే లోపే వాన అందుకుంది. ఈ క్రమంలో అరగంటకోసారి మ్యాచ్​ జరిగే విషయమై క్రికెట్​ అనలిస్టులు వివరాలు వెల్లడిస్తున్నారు.  9 గంటల సమయంలో వాన కాస్త తగ్గడంతో పిచ్​పై నుంచి కవర్లను తొలగించేందుకు రెడీ అయ్యారు. అంతలోనే మళ్లీ కుండపోత వాన అందుకోవడంతో హుటాహుటినా కవర్లను కప్పేశారు. దీంతో రాత్రి 11 గంటలు దాటినా వాన తగ్గకపోవడంతో రిజర్వ్​ డే అయిన మరునాడు (సోమవారం) ఫైనల్​ ఆడించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక.. ఇవ్వాల తీసుకున్న టికెట్స్​తోనే రేపటి మ్యాచ్​ చూడొచ్చని స్టేడియం అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement