Sunday, May 5, 2024

సింగరేణిలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి.. ఒక్క రోజే 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా మంగళవారం ఒక్క రోజే 2.24 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు సింగరేణి సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. బొగ్గు ఉత్పత్తిపాటు 2.35 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అత్యధిక స్తాయిలో బొగ్గును ఉత్పత్తికి కష్టపడిన సింగరేణి ఉద్యోగులు, అధికారులకు సీఎండీ అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడిని రాబోయే రోజుల్లో కొనసాగించాలని ఆయన ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement