Friday, April 26, 2024

టెస్ట్‌ మ్యాచ్‌ ప్రాక్టీస్ లో కెఎల్‌ రాహుల్‌కి గాయం..

టీమ్‌ ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు. గురువారం జరగనున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ప్రాక్టీసు చేస్తున్న సమయంలో అతని చేతికి గాయమైనట్లు సమాచారం. అయితే అతని గాయం అంత తీవ్రమైనది కాదని, ఫ్యాన్స్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్‌ ఇండియా బ్యాటంగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే రెండో టెస్టులో రాహుల్‌ ఆడనున్నాడా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.


ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం వల్ల చివరి వన్డేతో పాటు టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉన్న కెఎల్‌ రాహుల్‌ సైతం మ్యాచుకు దూరమవుతున్నాడని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి స్థానంలో ఎవరినీ భర్తీ చేస్తారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement