Thursday, April 25, 2024

న్యూజిలాండ్ లో RC15షూటింగ్.. గ్యాప్ లో స్నాక్స్ తింటోన్న రామ్ చరణ్.. కియారా

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RC15 మూవీతో బిజీగా ఉన్నాడు. కాగా ఈ చిత్ర యూనిట్ న్యూజిలాండ్ లో ఉంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారట. వారం కిందనే న్యూజిలాండ్ కు వెళ్లిన ఈ యూనిట్ శరవేగంగా షూట్ ను జరుపుతోంది. ఈ మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ జిమ్ వర్కౌట్స్, న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆర్సీ15’ సెట్స్ నుంచి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరిన్ని ఫొటోలను పంచుకుంది. షూటింగ్ గ్యాప్ లో స్నాక్స్ తింటూ రామ్ చరణ్, కియారా యూనిట్ తో సందడి చేస్తున్న ఫొటోలను పంచుకుంది. చెర్రీ, కియారా బర్గర్ తింటూ ఫొటోలకు క్రేజీగా పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. పొలిటికల్ డ్రామాతో పాటు యాక్షన్ పరంగానూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేలా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను బట్టి రామ్ చరణ్ పవర్ ఫుల్ యాంటీ – కరప్షన్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement