Sunday, April 28, 2024

హైద‌రాబాద్‌లో ఎంఐఎం కార్యక‌ర్త‌ల రేవ్ పార్టీ

హైద‌రాబాద్ న‌గ‌రంలోని చాంద్రాయ‌ణ‌గుట్ట‌లో రేవ్ పార్టీ క‌ల‌క‌లం రేపుతోంది. అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఓ ఇంట్లో ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు రేవ్ పార్టీ నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. మ‌జ్లిస్ నేత ప‌ర్వేజ్ త‌న స్నేహితుల‌తో క‌లిసి రేవ్ పార్టీ నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. చాంద్రాయ‌ణ‌గుట్ట‌లో ఓ ఇంట్లోకి ఇత‌ర రాష్ర్టాల మ‌హిళ‌ల‌ను పిలిపించి ఆశ్లీల నృత్యాలు చేయించారు. మ‌ద్యం సేవించిన వారు మ‌గువ‌ల‌తో చిందులు వేసిన వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ పార్టీకి సంబంధించిన వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement