Monday, April 29, 2024

రష్మిక మంద‌న్న నా క్ర‌ష్.. శుభ‌మాన్ గిల్

త‌న క్ర‌ష్ పేరుని వెల్ల‌డించాడు క్రికెట‌ర్ శుభ‌మాన్ గిల్. ఆయ‌న చెప్పిన ఆన్సర్‌తో నెటిజన్లతోపాటు అభిమానులకు షాక్ ఇచ్చాడు. సారా అలీ ఖాన్ లేదా సారా టెండూల్కర్ మాత్రం కాదని, దక్షిణాది సినిమాల్లోని ప్రముఖ నటి తన క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు. మీకు ఇష్టమైన బాలీవుడ్ నటి ఎవరు అంటూ ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్‌ను ప్రశ్నించగా.. ఆయన సమాధానమిస్తూ..రష్మిక మందన్న నా క్రష్ అంటూ బదులిచ్చాడు. శుభ్‌మన్ సమాధానం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. గతేడాది శుభ్‌మాన్‌ను ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటి ఎవరు అంటూ అడిగితే.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే సారా అంటూ బదులిచ్చాడు. అలాగే ‘మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అవును, కాకపోవచ్చు అంటూ సంధిగ్ధంలో పడేశాడు.కాగా శుభ్‌మన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంటాడు. సారా అలీ ఖాన్, శుభ్మాన్ తరచుగా పార్టీలలో కలిసి కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు శుభ్‌మన్ సారాతో డేటింగ్ చేస్తున్నాడా..లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement