Sunday, May 19, 2024

మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయాలు

మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే యోచనలో శివసేన పార్టీ ఉంది. విధాన సభను రద్దు చేయొచ్చంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్ లో మంత్రి హోదాను ఆదిత్య ఠాక్రే తొలగించుకున్నారు. శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శివసేనకు మొత్తం 55మంది ఎమ్మెల్యేలున్నారు. షిండే వెంట 34మంది శివసేన ఎమ్మెల్యేలు వెళ్లారు.

ఠాక్రే వైపు మిగిలింది 21మంది ఎమ్మెల్యేలే. ఉద్దవ్ ఠాక్రే సంప్రదింపులకు ఏక్ నాథ్ షిండే దిగిరావడం లేదు. బీజేపీ పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండే తెలిపారు. షిండే డిమాండ్లకు ఠాక్రే తలొగ్గలేదు. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని ఠాక్రే తేల్చి చెప్పారు. రాజీపడటం కన్నా.. అసెంబ్లీ రద్దే మేలనుకుంటున్న ఠాక్రే. ఒంటి గంటకు మహారాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశమైంది. అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement