Friday, April 26, 2024

వార‌సుడు నుండి.. రంజిత‌మే సాంగ్ తెలుగు వెర్ష‌న్ పై అప్ డేట్

త‌మిళ స్టార్ హీరో టాలీవుడ్ ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్ లో న‌టిస్తోన్న చిత్రం వార‌సుడు. తమిళంలో వారిసుగా రూపొంద‌నుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌, నిర్మిస్తున్నారు. ద్విభాషా సినిమాగా రూపొందిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తుంది. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. వారసుడు సినిమా ప్రమోషన్‌లను చిత్ర బృందం స్టార్ట్‌ చేసింది.

ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్‌ ఇటీవలే రంజితమే సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. థమన్‌ స్వర పరిచిన ఈ పాట ఇప్పటివరకు 70మిలియన్ల వ్యూస్‌ రాబట్టి చార్ట్‌బస్టర్ అయింది. అయితే ఈ సాంగ్‌ కేవలం తమిళ భాషలోనే రిలీజైంది. కాగా చిత్రబృందం తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈ పాటను నవంబర్‌ 30న ఉదయం 9:09 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. తమిళ వెర్షన్‌ను హీరో విజయ్‌, ఎమ్.ఎమ్‌ మానసితో కలిసి ఆలపించారు. కాగా తెలుగు వెర్షన్‌ను అనురాగ్‌ కులకర్ణి పాడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement