Friday, April 26, 2024

నెట్టింట షేక్ చేస్తోన్న రంజితమే సాంగ్.. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం వారిసు. ఈ మువీ నుంచి విడుదలైన మాస్‌ సాంగ్‌ నెట్టింట షేక్‌ చేస్తోంది. ‘రంజితమే’ హ్యాష్‌ టాగ్‌తో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సాంగ్‌ విడుదలయ్యి పది రోజులవుతోన్నా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. పైగా రోజురోజుకీ మరింత దూసుకుపోతోంది. ఈ పాటకు ఇప్పటి వరకు దాదాపు 50 మిలియన్ల వ్యూస్‌ (అంటే 50 కోట్లు), 18 లక్షల వీక్షణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే భారీ క్రేజ్‌ పొందిన వారిసు వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌, రష్మిక, ప్రభు, శరత్‌కుమార్‌, ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, ఖుష్బూ, సంగీత తదితరులు నటించారు. తమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్‌ ప్రమోషన్లలో బిజీగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement