Sunday, May 5, 2024

రంగ‌మార్తాండ‌పై కీ అప్ డేట్ ఇచ్చిన – ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ

నాలుగేళ్ల త‌ర్వాత రంగ‌మార్తాండ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి అప్ డేట్స్ ఇస్తూ..సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు. మ‌రో కీ అప్ డేట్ ఇచ్చాడీ క్రియేటివ్ డైరెక్ట‌ర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప‌నులు కూడా పూర్తి అయ్యాయ‌ని, అవుట్ పుట్ చాలా బాగా రావ‌డం సంతోషంగా ఉంద‌ని చెప్పాడు. రంగ‌మార్తాండ షూటింగ్ పార్టు పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నులు దాదాపు పూర్త‌యిన‌ట్టేన‌ని ఇన్‌సైడ్ టాక్‌. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ కాబోతుంది. ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌సూయ భ‌రద్వాజ్‌, బ్ర‌హ్మానందం, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కృష్ణ వంశీ 2017లో సందీప్ కిష‌న్‌, రెజీనా క‌సాండ్రా హీరోహీరోయిన్లుగా న‌టించిన న‌క్ష‌త్రం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. మ‌ళ్లీ నాలుగేళ్ల త‌ర్వాత రంగ‌మార్తాండ సినిమాతో మంచి బ్రేక్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement