Sunday, April 28, 2024

రంగమార్తాండకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన.. బ్రహ్మానందం

స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎమోషనల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హౌస్‌ఫుల్‌ మూవీస్‌-రాజ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. లెజెండరీ సంగీత దర్శకులు ఇళయరాజా మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. త్వరలోనే రంగమార్తాండ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్‌. కాగా ఈ మూవీకి డబ్బింగ్ ని చెప్పడం ప్రారంభించారు బ్రహ్మానందం. తెలుగు రంగు చొక్కా, నిక్కర్‌ ధరించిన బ్రహ్మానందం డబ్బింగ్‌ స్టూడియోలోని సోఫాలో కూర్చొని డబ్బింగ్ చెబుతున్న స్టిల్స్‌ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ డబ్బింగ్ చెప్పిన స్టిల్స్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement