Wednesday, May 1, 2024

రంగ రంగ‌వైభ‌వానికి -సెన్సార్ క్లియ‌ర్

హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తోన్న తాజా చిత్రం రంగ రంగ వైభ‌వంగా.ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టయినర్. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన అన్ని అంశాలు ఈ కథలో కుదిరాయనీ, ఈ సినిమాకి వచ్చిన ఏ ఒక్కరూ నిరాశతో తిరిగి వెళ్లరని హీరో వైష్ణవ్ తేజ్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.రంగ రంగ వైభవంగా వైష్ణ‌వ్ తేజ్ మార్కెట్ ను సెట్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement