Thursday, May 2, 2024

ఆక‌ట్టుకుంటోన్న రామ్ సేతు తెలుగు టీజ‌ర్

రామ్ సేతు చిత్రం నుండి తెలుగు టీజ‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్నారు. అక్షయ్‌కు జోడీగా జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నుష్రత్‌ భారుచ్చా హీరోయిన్లుగా నటించారు. అమెజాన్, లైకా సంస్థలతో కలిసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుస్తున్నారు. అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ కీలకపాత్రలో నటించారు. యాక్షన్‌ అడ్వేంచర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. రామ్‌సేతు కాపాడుకోవడానికి మన దగ్గర ఇంకా మూడు రోజులే గడువుంది’ అంటూ ఆసక్తికరంగా టీజర్‌ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ సీన్స్‌ వేరే లెవల్లో ఉన్నాయి. టీజర్‌లో చేసింగ్‌ సీన్లు, ఫైరింగ్‌ సీన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ‘రామ్‌సేతును చేరుకోబోతున్నాం’ అంటూ చివరిలో వచ్చిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. టీజర్‌తోనే చిత్రబృందం సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. రామ్‌సేతును కాపాడటానికి అక్షయ్‌కుమార్‌ ఎలాంటి సాహసాలు చేశాడు అనే కాన్సెప్ట్‌తో చిత్రం తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement