Friday, May 3, 2024

లైకాతో ర‌జినీకాంత్ 170 మూవీ..

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 170వ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారి కంగా ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘జై భీమ్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌ ఈ సినిమాకు దర్శకుడు.
”టి.జె.జ్ఞానవేల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్ర న్‌ సంగీతాన్ని అందించనున్నారు. జి.కె.ఎం. తమిళ్‌ కుమరన్‌గారి నేతృత్వంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తాం. అలాగే 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. రజిని గారితో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించాం. ఆయనతో ఉన్న అనుబంధం ఇలా కొనసాగటాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. అభి మానులు, ప్రేక్షకులు సంతోషపడేలా ఎన్నో గొప్పగా ఈ సినిమాను రూపొం దించటానికి అందరి ఆశీర్వాదాలు మా కు ఇవ్వండి” అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement