Thursday, May 23, 2024

రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిభ క‌లిగిన ద‌ర్శ‌కుడు-మెగాస్టార్ చిరంజీవి

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిభ క‌లిగిన ద‌ర్శ‌కుడ‌ని పొగిడారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్’ ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ… రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజమౌళి చాలా లోతుగా చూస్తారని, ప్రతి ఒక్కటి ఎంతో పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తారని… ఆయన కోరుకునే ఔట్ పుట్ ను ఒక నటుడిగా తాను ఇవ్వగలనో, లేదో తనకు తెలియదని చెప్పారు. మరోవైపు రాజమౌళి ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి తెరకెక్కిస్తారని… ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదేళ్ల పాటు తీసుకుంటారని… అంత సమయాన్ని తాను ఇవ్వలేనని అన్నారు. ప్రస్తుతం తాను ఒకే సారి నాలుగు చిత్రాలు చేస్తున్నానని చెప్పారు. ఈ కారణం వల్లే రాజమౌళితో సినిమా చేయాలని కానీ, పాన్ ఇండియా స్థాయి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కానీ తనకు లేదని తెలిపారు. ఒక్క సినిమాకైనా దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement