Sunday, June 16, 2024

AP: కర్నూలు జిల్లా లో రోడ్డు ప్రమాదం…ఇద్దరు చిన్నారులు మృతి

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది.కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి.

- Advertisement -

మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు హాహాకారాలు చేస్తు్న్నారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. మృతులు లక్ష్మీ(13), గోవర్ధిని(8) హైద్రాబాద్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణీకులను సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కోడుమూరులో బస్సు ప్రమాద స్థలము సందర్శించిన కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్

Advertisement

తాజా వార్తలు

Advertisement