Tuesday, April 30, 2024

రాజ‌మండ్రి రోజ్ మిల్క్- టైటిల్ సాంగ్ రిలీజ్

రాజ‌మండ్రి రోజ్ మిల్క్ చిత్రం నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. జై జాస్తి, అనంతిక, జంటగా సన్నీల్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతుంది ఈ చిత్రం . నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రం బృందం తాజాగా ఈ చిత్రం టైటిల్‌సాంగ్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రచించిన నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా.. ఉండే నిండుగా.. ఫస్ట్‌డే ఫస్ట్ షో చూసినట్టుగా అనే సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజయ్ అరసాడ సంగీత బాణీలు అందించిన ఈ సాంగ్‌ను నేడు విడుదల చేశాం. పాటకు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు.

https://twitter.com/madurimadhu1/status/1551462335470247936
Advertisement

తాజా వార్తలు

Advertisement