Monday, May 20, 2024

Maharashtra | బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన రాజ్ ఠాక్రే..

రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మంగళవారం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్‌డిఎ కూటమికి షరతులు లేని మద్దతు ప్రకటించింది. గత నెలలో రాజ్ ఠాక్రే, ఆయన కుమారుడు అమిత్ ఠాక్రే… కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు ఆయన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు.

మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే శివసేన సంయుక్త ప్రకటన చేశాయి. మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలు ఉండగా ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన 21 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లలో పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో ఐదు దశల్లో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement