Sunday, April 28, 2024

కనకదుర్గమ్మ ఆలయానికి కాసుల వర్షం.. ఈ ఏడాది 157 కోట్ల ఆదాయం..

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని కనకదుర్గమ్మ ఆలయానికి కానుకల వర్షం కురిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యధిక నికర ఆదాయం కలిగిన దేవాలయంగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నిలిచింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం 2023-24 అసెస్మెంట్ ఇయర్ కు సంబంధించి రూ156.97 లక్షల రూపాయల నికర ఆదాయం వచ్చింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఈ ఏడాది ఆదాయం దేవస్థానానికి చేకూరింది. కరోనా విపత్కర సమయంలో ఆదాయం తగ్గిన తర్వాత, 2022-23 సంవత్సరంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు విశేషంగా విచ్చేయడంతో పాటు స్వామివారిని దర్శించుకునే కానుకల రూపంలో పెద్ద ఎత్తున అమ్మవారికి సమర్పించుకున్నారు. వివిధ పూజల్లో కూడా పాల్గొన్న భక్తులు అమ్మవారికి తోచిన విధంగా విరాళాలను అందజేశారు.

దీంతో హుండీ దర్శనం టికెట్లు, ఎఫ్డిఆర్ ల పై వడ్డీలు, సేవలు, ఇతర లైసెన్సులకు సంబంధించిన వాటిపై దేవాలయానికి ఆదాయం అపారంగా వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అసాధారణంగా, గణనీయంగా ఆదాయం పెరిగింది. గతంలో ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంతటి నికర ఆదాయం దేవస్థానం కి రాలేదని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భ్రమరాంబ తెలిపారు. గత ఏడాది 2022-23 సంవత్సరానికి గాను దేవాలయానికి మొత్తం రూ86.80 లక్షలు మాత్రమే ఆదాయం సమకూరిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement