Sunday, April 28, 2024

తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌.. మూడు రోజులు వానలే..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని హైద‌రాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు బలపడ్డాయ‌ని, దీనికి ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయ‌ని తెలిపింది. ఆదివారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గడిచిన 24 గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, జయశంకర్‌, నల్లగొండని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, ఆదిలాబాద్‌, కామారెడ్డి, సిద్ధిపేట, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం రికార్డయ్యింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా చోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement