Wednesday, May 1, 2024

Rain alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు..

తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో నేడు, రేపు వర్షాలు పడుతాయని చెబుతోంది వాతారణ కేంద్రం. మరోవైపు పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో నిన్న పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిజమాబాద్ జిల్లా కోటగిరిలో కుంభవృష్టి కురిసింది. ఇక్కడ అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు మేఘాలేర్పడి భారీ వర్షాలు కురవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భానుడు తన ప్రతాపం చూపించాడు. ఖమ్మం జిల్లా నాగులవంచలో అత్యధికంగా 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

అటు ఏపీలో కూడా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముంతని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తుండటం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 28 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాంలలో రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రాలో గురు, శుక్ర, శని వారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement