Monday, April 29, 2024

ఉద్య‌మంలో చ‌నిపోయిన‌ రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే: రాహుల్

కేంద్రం తెచ్చిన వ్య‌వ‌యాసాయ చ‌ట్టాల‌ను నిరిసిస్తూ చేప‌ట్టిన‌ ఉద్యమంలో దాదాపు 700 మందికి పైగా రైతులు చ‌నిపోయార‌ని, వారి కుటుంబాల‌కు నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన రాహుల్ ఉద్యమంలో మరణించిన ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సాగు చట్టాలపై ప్రధాని మోడీ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారని, వ్యవసాయ మంత్రి మాత్రం చ‌నిపోయిన‌ రైతుల డేటా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇచ్చి పంజాబ్ సర్కార్ ఆదుకుందని, ఇప్పటికైనా బీజేపీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement