Sunday, May 5, 2024

సంగారెడ్డి జిల్లాలో రెండోరోజు కొన‌సాగుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర‌…

సంగారెడ్డి : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిన్న భేల్ నుండి గణేష్ గడ్డ వరకు సాగిన సంగతి తెలిసిందే. అయితే నేటి రాహుల్ గాంధీ జోడో యాత్ర రుద్రరం గణేష్ గడ్డ నుండి ఉదయం 6 గంటలకు మొదలయింది. రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. దారిలో కంది మండల అయా గ్రామ పంచాయ‌తీ సర్పంచులు, పార్టీ నేతలు, కార్యకర్తలు రాహుల్ కి ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా రాహుల్ గాంధీకి 10వేల మంది గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో అభిమానం చాటుకున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారిపై కంది మండలాన్ని దాటుకుని, సంగారెడ్డి చౌరస్తా రోడ్డు మీదుగా సంగారెడ్డి పట్టణంలోకి ప్రవేశించింది. రాహుల్‌గాంధీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి సుమారు 35 కళా బృందాలు స్వాగతం పలికారు. ఈ కళా బృందాలు రాహుల్ గాంధీ పాదయాత్రలో ముందు ఉన్నాయి. అయితే ఈరోజు సాయంత్రమే అందోలు నియోజకవర్గంలోకి అడుగు పెట్టనున్నరు. రాహుల్‌ నేడు రాత్రి బస సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ ఆవరణలో రాత్రి బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement