Thursday, May 2, 2024

అదాని సంపద ఎలా పెరిగింది… ?: రాహుల్ గాంధీ

కరోనా సంక్షోభం సమయంలో ప్రపంచ కుబేరులు సంపద సైతం తరిగిపోయింది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ ఆదాయంలో క్షీణత కనిపించినా, భారత సంపన్నుడు గౌతమ్ అదానీ మాత్రం 16.2 బిలియన్ డాలర్ల ఆదాయంతో 2021లో అత్యధికంగా ఆర్జించినవారిలో నెంబర్ వన్ గా నిలిచాడు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. కరోనా దెబ్బకు ప్రతి ఒక్కరూ విలవిల్లాడుతుంటే అదాని మాత్రం 50 శాతానికి పైగా తన సంపదను ఎలా పెంచుకోగలిగాడని సందేహం వ్యక్తం చేశారు.

ఈ మధ్య ప్రధాని మోదీ నీ విమర్శిస్తూ హమ్ దో హమారా దో స్లోగన్ ఎక్కు పెడుతూ వస్తున్నారు. ప్రధాని కేవలం తన కార్పొరేట్ మిత్రుల కోసమే పనిచేస్తున్నాడని వ్యాఖ్యానించడం తెలిసిందే. అదానీలు, అంబానీలకే ఆయన ప్రధాని అని విమర్శించారు.

2020లో మీరు ఎంత సంపదను పెంచుకోగలిగారు?… అందుకు జవాబు సున్నా అనే చెప్పాలి. మీరోవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఇతను మాత్రం తన సంపదను 50 శాతం మేర పెంచుకున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యమైందో నాకు చెప్పగలరా?” అంటూ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement