Monday, April 29, 2024

సూరత్ కోర్టు తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం దావా కేసులో సూరత్‌ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్‌ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన శిక్షపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ త్వరలోనే జరగనుంది.

కాగా, సూర‌త్‌ కోర్టు దోషిగా నిర్ధారించడంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. శిక్షను నిలుపుదల చేస్తే, ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. అయితే శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహు‌ల్‌ చేసిన అభ్యర్థనను సెషన్స్‌ కోర్టు, హైకోర్టు నిరాకరించాయి. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement