Thursday, May 2, 2024

శృంగార దేవత అంటూ శ్రీరెడ్డిపై రఘురామ కృష్ణంరాజు హాట్ కామెంట్స్

వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పై వివాదాస్పద న‌టి శ్రీరెడ్డి బూతులు తిడుతూ సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. గాజుగాడు, విగ్గురాజు అంటూ మండిపడింది. బీజేపీ అండ చూసుకుని ర‌ఘురామ కృష్ణం రాజు రెచ్చిపోతున్నార‌ని.. వైసీపీ గుర్తుపై గెలిచి డ్రామాలేంటి అంటూ మండిప‌డింది. వైసీపీ జోలికి వచ్చినా.. జగన్‌ని అన్నా తానే కౌంటర్ ఇస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది.

అయితే శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌పై ర‌ఘురామ కృష్ణంరాజు కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. కొంద‌రు దొంగ‌ రెడ్లు కొత్త‌గా త‌మ‌కు ఓ కుల‌ దేవ‌త‌, శృంగార దేవ‌త‌ను ఎన్నుకున్నార‌ని శ్రీరెడ్డి ఉద్దేశించి కౌంట‌ర్ ఇచ్చారు. కొంద‌రు ల‌ఫుట్‌గాళ్లు తెర వెనుక ఉండి ఆమెతో త‌న‌ను తిట్టిస్తూ వీడియోలు చేయిస్తున్నార‌ని ఆరోపించారు. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేసిన నీలి చిత్ర న‌టి.. ఇప్పుడు త‌న‌పై కూడా మాట‌లు మాట్లాడుతోంద‌ని మండిపడ్డారు. 10 శాతం ప‌నికిరాని రెడ్ల కుల దేవ‌త‌.. ప్ర‌తీవ్ర‌త అంటూ శ్రీరెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఈ కుల దేవ‌త ర‌క‌రాక‌ల శృంగార భంగిమ‌ల్లో ద‌ర్శ‌నిమ‌స్తుంద‌ని సెటైర్ వేశారు. కావాలంటే న‌గ్న చిత్రాలు కూడా దొరుకుతాయ‌ని.. చెత్త రెడ్లంతా ఆ దేవ‌త ప్ర‌తిమ‌ను ఇంట్లో పెట్టుకోండి అంటూ సూచించారు. భ‌విష్య‌త్తులో త‌న‌ను తిట్టే అవ‌కాశాలు రావాల‌ని.. వాటికి మంచి రెమ్యున‌రేష‌న్ రావాల‌ని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు ర‌ఘురామ కృష్ణంరాజు.

Advertisement

తాజా వార్తలు

Advertisement