Friday, December 6, 2024

Radisson Drugs Case: క్రిష్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ …

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. ఈ డ్రగ్స్ పార్టీలో సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కూడా ఉన్నట్టు పేర్కొన్న పోలీసులు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీస్ జారీ చేశారు.. ఆయ‌న సోమ‌వారం విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని విచార‌ణాధికారికి లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

విదేశాల‌కు నీల్ జంప్…అజ్ఞాతంలో లిసి

ఇప్పటికే ఈ కేసులో శ్వేత, లిసి, నీల్, సందీప్ లు పరారీలో వున్నారు. నీల్ విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. డ్రగ్స్ సరఫరా గుట్టు విప్పేందుకు ప్రత్యేక టీమ్ లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే వివేకానంద డ్రైవర్ కు డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ అలీని అరెస్టు చేశారు అధికారులు. అబ్బాస్ అలీ ఇచ్చిన సమాచారంతో మరో డ్రగ్ సరఫరాదారుడు మిర్జా వాహిద్ అదుపులో తీసుకున్నారు.

- Advertisement -

మిర్జా వాహిద్ డ్రగ్స్ ఎక్కడి నుండి తెస్తున్నాడో దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. మిర్జా వాహిద్ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 14 మందిని నిందితులుగా పోలీసులు చేర్చడంతో ఈ కేసు ఉత్కంఠగా మారింది. ఈ కేసులో ఇప్ప‌టికే ఆరుగురిని అరెస్ట్ చేశారు.. మిగిలిన వారి కోసం పోలీసులు వేట కొన‌సాగిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement