Sunday, April 28, 2024

జీవిత‌గా రాధిక‌…

‘పలాస 1978’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్‌ అట్లూరి కొత్త చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’ ఫస్ట్‌ లుక్‌ ఇటీ-వల విడుదలైన విషయం తెలిసిందే. సీనియర్‌ నటి, నాయికగా అనేక చిత్రాల్లో నటించిన రాధిక ఈ చిత్రంలో నటిస్తోంది. చిత్ర దర్శకుడు వెంకట సత్య చెప్పిన ‘ఆపరేషన్‌ రావ ణ్‌’ స్క్రిప్ట్‌ నచ్చి నటనకి ప్రాధాన్యం ఉన్న ఎంతో హృద్యమైన ‘జీవిత’ పాత్ర చేసినట్టు” అని క్యారెక్ట ర్‌ లుక్‌ పోస్టర్‌ ఆవిష్కరణ సందర్భంగా సీనియర్‌ నటి రాధికా శరత్‌ కుమార్‌ చెప్పారు. ఆవిడ దర్శ కుడి గురించి మాట్లాడుతూ ”తొలి చిత్రం అయిన ప్పటికీ వెంకట సత్య నా పాత్రని మలిచిన తీరు, చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ఎంతగానో ఆకట్టు-కుందని, తెలుగుతో పాటు- ఏక కాలంలో తమిళం లో విడుదలవుతున్న ఈ చిత్రంలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.
ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఆపరేషన్‌ రావణ్‌’లో రక్షిత్‌ అట్లూరి సరసన సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌ గా నటించా రు. షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్‌, మాటలు: లక్ష్మీ లోహిత్‌ పూజారి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.

Advertisement

తాజా వార్తలు

Advertisement